కోరుట్లలో అక్రమ లేఅవుట్ల రగడ! సర్వే నంబర్‌ 1490లో రిజిస్ట్రేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్ల అభ్యంతరం

 


కోరుట్లలో అక్రమ లేఅవుట్ల రగడ! సర్వే నంబర్‌ 1490లో రిజిస్ట్రేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్ల అభ్యంతరం

నిషేధ ఉత్తర్వులు ఉన్నా రిజిస్ట్రేషన్లు ఎలా? బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, అక్టోబర్ 17:

నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి? అనుమతులు లేని లేఅవుట్లతో మున్సిపాలిటీకి ఆదాయ నష్టం కలిగితే బాధ్యత ఎవరిది? చెరువు కాలువ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ప్లాట్ల విక్రయాలకు ఎవరు అనుమతిస్తున్నారు? అంటూ కోరుట్ల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో అక్రమ లేఅవుట్ల అంశం తీవ్ర చర్చకు దారితీసింది.

కోరుట్ల పట్టణంలోని సర్వే నంబర్‌ 1490, దాని సబ్‌ డివిజన్లలో అనధికార లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధమైన రిజిస్ట్రేషన్లు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ప్లాట్ల విక్రయాలు, మున్సిపల్ ఆదాయానికి జరుగుతున్న నష్టంపై 11వ వార్డు కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ విపక్ష కౌన్సిలర్లు ఏకమై మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌కు సంయుక్తంగా వినతిపత్రం అందజేశారు.


ప్రజల కష్టార్జిత సొమ్ముకు రక్షణ కల్పించాలని, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న లేఅవుట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments