కార్తీక్ రెడ్డి – ప్రగతి ల వివాహ వేడుకలో డా. పేట భాస్కర్
నూతన వధూవరులను ఆశీర్వదించి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల, నవంబర్ 15:
జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో బుగ్గారం మాజీ జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ – మాజీ ఎంపీపీ రాజమణి దంపతుల కుమారుడు కార్తీక్ రెడ్డి, ప్రగతిల వివాహ వేడుక అంగరంగ వైభవంగా, బంధుమిత్రులు, ప్రముఖుల సందడి మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ శుభకార్యానికి తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర తెలుగు దినపత్రిక ఎడిటర్ - డా. పేట భాస్కర్ హాజరై నూతన వధూవరులు కార్తీక్ రెడ్డి - ప్రగతిలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులు ప్రేమానురాగాలు, పరస్పర అవగాహనతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిత్యం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఆత్మీయుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకలో పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రజాసంఘాల నాయకులు, ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందజేశారు.
ఈ వేడుకల్లో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ, టిఆర్పీ జిల్లా అధ్యక్షుడు మేడి పాపయ్య, కాంగ్రెస్ నేత నిశాంత్ రెడ్డి, ప్రజాసంఘాల జేఏసీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బోనగిరి మల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలిశేట్టి గంగారెడ్డి, నాయకులు సత్యనారాయణ గౌడ్, చిర్ర గంగాధర్, రేగుల మోహన్, ఇట్యాల రాజేందర్, మోర్తాడ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




0 Comments