దుబాయిలో ఎమిరేట్స్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురి దుర్మరణం - ప్రజా దండోర

 


దుబాయిలో ఎమిరేట్స్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురి దుర్మరణం

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 09:

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన జగిత్యాల జిల్లా వాసులు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

దుబాయిలో అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రహదారిపై జరిగిన ప్రమాదంల 7 గురు మరణించారు. వీరిలో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురికి సాధారణ వార్డులో చికిత్స అందిస్తుండగా వీరిలో హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ సయీద్ కూడా ఉన్నారు, మృతులు ముగ్గురూ కూడా జగిత్యాల జిల్లాకు చెందిన వారేనని ప్రాథమిక సమాచారం.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం (51), మల్యాల మండలం తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన గొల్లపలి తిరుపతి గౌడ్ (42), మెట్ పల్లి మండల కేంద్రంలోని గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫీఖ్ (37)లు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. 

మృతదేహాలను భారత్‌కు పంపించడానికి దుబాయిలోని భారతీయ కాన్సులేటు అధికారులు మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

షార్జా కేంద్రంగా ఉన్న ఒక అల్యూమినియం డోర్ ఫ్రేం, గ్లాసుల పరిశ్రమలో వీరందరు పని చేస్తున్నారని తెలిసింది.డ్యూటీ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అకస్మాత్తుగా సాంకేతిక లోపంతో రోడ్డుపై ఆగిపోయిన లారీని వెనక నుంచి వచ్చి మినీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

మృత దేహాలను స్వదేశానికి  పంపించేందుకు కాన్సులేట్ అధికారులు స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తూ మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Post a Comment

0 Comments