ఇందిరమ్మ ఇండ్లను 100% గ్రౌండ్ చేయాలి- జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
డా. పేట భాస్కర్ , ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్ / జూలై 8 :
జిల్లాలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల 100% గ్రౌండ్ చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతి క్లస్టర్ అధికారి తన పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించి త్వరగా బేస్మెంట్ వరకు పనులు జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లలో గృహప్రవేశాలు త్వరగా నిర్వహించి, తుది దశ (ఫైనల్ స్టేజ్) జియో ట్యాగింగ్, క్యాప్చరింగ్ ప్రక్రియను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు.ప్రధాన కార్యాలయం నుంచి అందిన గుడిసె నివాసితుల (Hut Dwellers) జాబితా ఆధారంగా ఇంటింటి సర్వేను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారుల వివరాలను కలెక్టర్ లాగిన్‌కు పంపించాలని అధికారులను ఆదేశించారు.
నిర్మాణ పనులు ప్రారంభించని లేదా ఇల్లు నిర్మించేందుకు ఆసక్తి లేని లబ్ధిదారుల ప్రతిపాదనలను వెంటనే రద్దు (క్యాన్సిలేషన్) కోసం పంపించాలని తెలిపారు.
అలాగే ఇందిరమ్మ గృహాల రెండో విడత (ఫేజ్-2) మంజూరు ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలను పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో సమన్వయంతో పని చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.10860 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 9058 మార్క్అవుట్, 1215 బేస్మెంట్, 748 గోడల వరకు , 4233 స్లాబ్ లెవెల్, 1746 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, డి.ఆర్.డి.వో రఘువరన్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, హౌసింగ్ డి ఈ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపిడివోలు, క్లస్టర్ ఇంచార్జి లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.



0 Comments