పేకాట స్థావరం పై పోలీసుల దాడి, 7 సెల్ ఫోన్లు, 9 బైక్ లు స్వాధీనం 7గురు అరెస్ట్ మరో ముగ్గురు పరారీలో - ప్రజా దండోర

 


పేకాట స్థావరం పై పోలీసుల దాడి, 7 సెల్ ఫోన్లు, 9 బైక్ లు స్వాధీనం,7గురు అరెస్ట్ మరో ముగ్గురు పరారీలో..


ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, మే11 :


కోరుట్లలోని జమ్మి గద్దె సమీపంలో  ఆదివారం రాత్రి కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు కోరుట్ల ఎస్సై ఎం చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు అట్టి స్తావరంపై దాడి చేసి, పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను  అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 8500/- రూపాయల నగదు మరియు ఏడు సెల్ ఫోన్లు మరియు తొమ్మిది మోటార్ సైకిల్ లను స్వాధీనపరుచుకొనగా, మరొక ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. పేకాట ఆడుతున్న ఈ పదిమంది పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఈ దాడిలో  ఎస్సై తో పాటు కోరుట్ల పిఎస్ సిబ్బంది శివాజీ, ఎల్లయ్య, గంగాధర్, రామకోటి ఉన్నారు.

Post a Comment

0 Comments