కోరుట్ల గడి బురుజుల స్థలాలపై గుట్టుచప్పుడు కాకుండా అవినీతి ..! ప్రజల్లో గందరగోళం - ఎటు తేల్చని అధికారులు.. ఉద్యమాలు ఉదృతం.
-ఇన్నేళ్లుగా అ స్థలాలపై పర్మిషన్లు నిషేధం - కానీ ఇప్పుడు అవినీతి రాజ్యమేలుతుంది..?
మైసమ్మ సాక్షిగా ప్రజలను మోసం చేస్తున్న నాయకులకు, కమీషనర్ కు శిక్ష తప్పదు..
డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్ :
కోరుట్ల కోట బురుజులు అవి అద్భుతమైన చారిత్రక కట్టడాలు, రాజమహాల్ లాంటి అందమైన బురుజులతో పాటు దేవాలయం లాంటి కోనేరు, ప్రస్తుతం ఎంతో ప్రాచుర్యం పొందిన మహా దేవాలయం, చాళక్యుల కాలం నాటి సంపద, కొరవట్టు పేరిట కొలువైన చారిత్రాత్మక కుటమీ అనవాల్లు కలిగిన కోరుట్ల కోట బురుజులు మరియు కోనేరు శిథిలావస్థకు చేరిన రెండు బురుజులు మాత్రం వజ్రోత్సవాల పుణ్యాన కొంత భాగాన్ని రిపేర్లు చేయించి జాతీయ జెండా కలర్లు వేయడంతో కొత్త శోభ సంతరించుకుంది. వాటి స్థలాలపై అప్పటి కాలంలో పర్యవేక్షకులుగా వుంటూ వాటికి సంబంధించిన భూములపై శిస్తులు వసూలు చేసిన భూస్వాములు ఇప్పుడు బురుజులకు సంబంధించిన గ్రామ కంఠ, ఆబాది, పురావస్తు స్థలాలు మావంటే మావి అంటు మేము హక్కుదారులమంటు అమ్మకాలు చేస్తూ.. కోరుట్ల కోట బురుజుల అనవాళ్లను, ప్రజల ఆకాంక్షలను చిన్న భిన్నం చేస్తున్న చిత్రమైన ధగ.. ప్రజలను వంచిస్తూన్న దుర్మార్గపు సెగ..
ఇన్నేళ్లుగా గడి బురుజుల స్థలాలపై పర్మిషన్లు లేకుండా నిషేధం విధించిన ప్రభుత్వ పురావస్తు శాఖ ఇప్పుడు కొందరు బడా నాయకుల అండతో రియాల్టర్లు ఎంట్రీ ఇచ్చి.. అట్టి స్థలాలపై దాదాపు రెండు కోట్ల పెట్టుబడులతో మూడోవంతు కోట్ల రూపాయల దండుకుందామని దసరా ఉత్సవాలకు కోరుట్ల ప్రజలు ఎంతో పవిత్రంగా గడి స్థలాలలో జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా మహీశసూర వధ చేయడం, అదే స్థలాలో కొలువైన మైసమ్మ దేవత కు, మరో పక్క హనుమాన్ దేవాలయ నిర్మాణాలు కావాలని యువకులు, ప్రజలు ఎంతో పవిత్రంగా పండుగ జరుపుకనే ఆహ్లాదాన్ని అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు.
బైతుల్మాల్ రహదారి ఈ తతంగానికి పునాది..!
నిషేధిత గడి బురుజుల స్థలాల్లో పర్మిషన్లు తీసుకోవడం ఎలా అనుకుంటున్న సందర్భంలో ఆశా కిరణంలా బైతుల్మాల్ ట్రస్టు భవనానికి అ సంస్థ ప్రతినిధులు ఎం డి అరీఫ్ అను యాజమాని వద్ద పురాతన ఇల్లును ఖరీదు చేశారు. అనంతరం ఆ పురాతన ఇల్లును సదును చేసి నూతన భవనాన్ని నిర్మించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న సమయంలో అదే అదునుగా రియల్టర్లు గడి బురుజుల స్థలాలపై కన్నుపడి అ స్థలాల నుండి బైతుల్మాల్ కు రహదారి కావాలని ఆ వంకతో గడి స్థలాలకు కూడా పర్మిషన్ తీసుకోవచ్చని ప్లాన్ చేశారు కానీ బైతుల్మాల్ భవనానికి వెనుక వైపు తొమ్మిది ఫిట్ల రోడ్డు వుంది. ఈవిషయంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వరకు వెళ్లిన బురుజుల స్థలంలో రోడ్డుకు, నిర్మాణానికి పర్మిషన్ రాలేదు. అయినా పేద ప్రజలకు సేవ చేసే బైతుల్మాల్ కు పర్మిషన్ ఇస్తే అయిపోతుండే ఈ తతంగం జరిగేది కాకపోతుండే..!
కానీ మున్సిపల్ అధికారులు అది ప్రైవేట్ లాండ్ అని ఒకసారి ప్రభుత్వ స్థలాలను ఒకసారి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో రియాల్టర్లు ఒక అడుగు ముందుకు వేసి లక్షలాది రూపాయల ఎర వేసి గడి స్థలాలకు అనుకోని వున్న ఓ ఇంటి నెంబర్ ను ఒక స్పీక్ అవుట్ నోటీసు ఒక వీలునామాతో ఇంటి నెంబర్ 6- 4- 228 లో ఏకకాలంలో పరిధికి మించి ముప్పై సంవత్సరాల పన్నును వసూలు చేయడమే కాకుండా పేరు మార్పిడితో పాటు 5800 గజాలకు విఎల్టీ వేసిన కమీషనర్ మన కోరుట్ల ప్రజల ఆస్తిపై అప్పనంగా దాదాపు ముప్పై లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రియాల్టర్లతో 8 లక్షల ప్రభుత్వ ఛాలన్ కట్టించి విఎల్టీ పర్మిషన్ ఇచ్చారని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, పాత్రికేయులు బాహుటంగా ప్రకటిస్తున్నారు.
మరో ఆరు వేల గజాలకు 20 లక్షలతో అధికారులతో ఒప్పందం అందులో నుండి ఒక బడా నాయకునికి 1500 గజాల స్థలం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వినికిడి. అంటే మొత్తం 2 ఎకరాల 14 గుంటల 26 గజాల స్థలాన్ని విఎల్టీ పర్మిషన్ తీసుకోని గడి స్థలాలకు గండి కొట్టి ప్లాటుగా మార్చి అమ్ముకోవాలని రియాల్టర్లు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు 80 లక్షల వరకు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్న ఇన్ని సాక్ష్యాధారాలు బయటపడ్డ ఉన్నతాధికారులు కమీషనర్ ను సస్పెండ్ చేయకపోవడం, విఎల్టీలను రద్దు చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయాలలో అధికార పక్షం అండతోనే మున్సిపల్ కమిషనర్ అవినీతికి అంతు లేకుండా పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోరుట్ల గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డతో పాటు ప్రజలు, యువత, మహిళలు, పట్టణ ప్రముఖులు బురుజుల వద్ద గల గ్రామ కంఠం, అబాది స్థలాలపై అప్రమత్తం కావాలంటూ అఖిల పక్ష ప్రజా సంఘాల నాయకులు వాటి రక్షణకై చాలా సంవత్సరాలుగా ఉద్యమించడం వల్ల ఇన్ని రోజులు అగినవి కానీ ఇప్పుడు కాపాడవలసిన రక్షకులే వాటిని అమ్మాకాలకు పెడుతుంటే రేపటి తరానికి ఎం సమాధానం చెప్పాలని గడి బురుజుల అభిమానులు వాపోతున్నారు. ఇప్పుడు వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రజలపై వుందని ఇక పోరాటాలకు సిద్ధం కావాలని అప్పుడే ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు కనువిప్పు జరిగి వాటిని కాపాడి భవిష్యత్తు తరాలకు అందిస్తారని కోరుట్ల అఖిలపక్ష ప్రజాసంఘాలు పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే ఐదు రోజులు మండుటెండలో నిరసన దీక్షలు చేపట్టారు. రాస్తారోకో చేశారు. ఇప్పుడు సంతకాల సేకరణలో బిజీ అయ్యారు.
ఇకనైన ప్రజలుగా కోరుట్ల గడ్డ బిడ్డలుగా ముందుకు రావాలని అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు అండగా వుండి గడి బురుజులు, స్థలాలు కాపాడుకోవాలని అక్కడ యదావిధిగా విజయదశమి, బతుకమ్మ, గణేష్ ఉత్సవాలు జరగాలని అ స్థలాలలో మార్కేట్ యార్డు, పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు శిథిలావస్థకు చేరిన కోనేరు, బురుజుల అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని ఆశిద్దాం.






0 Comments