కోరుట్ల గడి బురుజుల మైసమ్మ సాక్షిగా ఇక స్థలాల రక్షణకు ఉద్యమాలే శరణ్యం..!

 


కోరుట్ల గడి బురుజుల మైసమ్మ సాక్షిగా ఇక స్థలాల రక్షణకు ఉద్యమాలే శరణ్యం..!


- ఇచ్చిన విఎల్టీ పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలని తీర్మానం, మున్సిపల్ ముందు ధర్నా


-  కోరుట్ల అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకుల డిమాండ్.

డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్  :

ఎంతో ప్రాధాన్యత కలిగిన కోరుట్ల గడి బురుజులు చారిత్రాత్మక కట్టడాలని వాటి స్థలాలను అమ్ముకోవాలని చూస్తున్న రియాల్టర్లు వారికి సహకరిస్తున్న రాజకీయ పార్టీలలోని కొందరి నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని గడి బురుజుల మైసమ్మ తల్లి సాక్షిగా ఇక ఉద్యమాలే శరణ్యం అని కోరుట్ల అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు.              


సోమవారం కోరుట్ల ముదిరాజ్ సంఘ భవనంలో జరిగిన అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక సమావేశానికి ముందుగా గడి బురుజుల కాలం నుండి అక్కడే పూజలు అందుకుంటున్న మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన నాయకులు అనంతరం సమావేశం ప్రారంభించారు. 


ఈసందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు నాయకులు పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ  చాళక్యుల కాలం నాటి సంపదనే ఈ గడి బురుజులు అని, కోనేరు బురుజులు శిథిలావస్థకు చేరిన వాటిని మరియు  స్థలాలను  కాపాడుకోవాల్సిన బాధ్యత కోరుట్ల ప్రజలపై వుందని ఆనాటి కాలంలో పర్యవేక్షకులుగా వున్న భూస్వాములు నేడు   బురుజులకు సంబంధించిన గ్రామ కంఠ, ఆబాది స్థలాలకు పట్టాదారులమని అమ్మకాలు చేస్తున్న వారి మాటలు ప్రజలు, పాలకులు నమ్మవద్దని అన్నారు.         


ఇంతకాలంగా గడి బురుజుల స్థలాలపై పర్మిషన్లు లేకుండా నిషేధం విధించిన ప్రభుత్వం పురావస్తు శాఖ ఇప్పుడు కొందరు బడా నాయకుల అండతో రియాల్టర్లు ఈ తతంగం చేస్తున్నారని ఆరోపించారు.  దసరా ఉత్సవాలకు కోరుట్ల ప్రజలు ఎంతో పవిత్రంగా గడి స్థలాలలో జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా మహీశసూర వధ ఇవే స్థలాలో జరుగుతాయని ఇకనైనా సంబంధిత అధికారులు, నాయకులు కండ్లు తెరవాలని ఈస్థలాలలో కూరగాయల మార్కెట్, ఆహ్లాదకరమైన పార్క్ ను ఏర్పాటు చేయాలని, ఈ స్థలాలలో ఇచ్చిన విఎల్టీలను రద్దు చేయాలని సమావేశం తీర్మానించింది.



అనంతరం కోరుట్ల మున్సిపల్ కార్యాలయం వద్ద నాయకులు ధర్నాకు దిగారు. లక్షలాది రూపాయల లంచాలతో గడి స్థలాలలో విఎల్టీ వేసిన అధికారులను సస్పెండ్ చేయాలని ,విఎల్టీలను వేంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం, డా. పేట భాస్కర్, ఎం డి ముజాహిద్, తుమ్మలపల్లి శ్రీనివాస్, చింత భూమేశ్వర్, ఆలీ నవాబ్, ప్రముఖ న్యాయవాది బోయిని సత్యం, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర శేఖర్, బిజేపి పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ, సిపిఐ నేత సుతారి రాములు, సిపిఎం పట్టణ అధ్యక్షుడు కుంచెం శంకర్, బిఆర్ఎస్ నాయకులు భూపేల్లి నాగేశ్వరరావు, కృష్ణంరాజు, ఎన్ఎచ్ఎఫ్ అధ్యక్షుడు షాహేద్ మహ్మద్ షేక్, టిడిపి నాయకులు పోతని సత్యం వివిధ సంఘాల నాయకులు ముజబీర్ రెహమాన్, ఉప్పుగండ్ల అశోక్, పిట్టల రాజం, బెక్కెం అశోక్, రాజు, మ్యాకల గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments