ఈమధ్యనే జరిగిన వీరహనుమాన్ విజయ యాత్రలో గాయపడ్డ గుర్రాల రాజ్ కు ఆపరేషన్ చేయించిన డాక్టర్ అనూప్ రావు
ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 4 :
కోరుట్ల పట్టణంలో ఈమధ్యనే జరిగిన వీర హనుమాన్ విజయయాత్రలో ప్రమాదవశాత్తు గుర్రాల రాజ్ కుమార్ కు ముక్కుపై బలమైన గాయం తగలగ వెంటనే స్పందించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనూప్ రావు వెంటనే స్పందించి కోరుట్లలోని రేనిహాస్పిటల్లో చికిత్స అందించి డాక్టర్ సూచనమేరకు ఆపరేషన్ చేయాలని సూచించాగా డాక్టర్ అనూప్ రావు వెంటనే కరీనగర్ కి పంపించి తన సొంత ఖర్చుతో (సుమారు 1,00,000/- పైన) కరీంనగర్ లోని ప్రముఖ ENT హాస్పిటల్ లో Laser Operation చేయించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, కౌన్సిలర్ ఇందూరి తిరుమల వాసు, బీజేపీ నాయకులు మాడవేణి నరేష్, సుదవేణి మహేష్, గిన్నెల శ్రీకాంత్ , తులసి కృష్ణ, బేక్కం అశోక్ లు పాల్గొన్నారు.
ఈసందర్భంగా కోరుట్ల బజరంగ్ దళ్ నాయకులు మాట్లాడుతూ గుర్రాల రాజ్ ఆపరేషన్ కు సహకరించినందుకు డాక్టర్ అనూప్ రావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బజరంగ్ నాయకులు కల్లెడ రోహిత్, పల్లికొండ వెంకటేష్, రాచకొండ చందు, కళ్యాణ్ మరియు బజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు


0 Comments