కోరుట్లలో జరిగే దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

 


కోరుట్లలో జరిగే దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం 

ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 4 :

దివంగత భారత మాజీ ఉపప్రధాని, సమాతవాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద తేదీ : 05 -04 -2026, ఆదివారం ఉదయం 9 గంటలకు కోరుట్ల మున్సిపల్ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించే అ మహానీయుడి 119 వ జయంతోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన స్పూర్తిని సమాజానికి తెలియజేయాలనే సంకల్పంతో నిర్వహించే.. 

ఈ కార్యక్రమానికి కోరుట్ల అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు, నాయకులకు మరియు అధికారులకు వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులకు, పాత్రికేయులకు, దళిత సంఘాల నాయకులకు మేధావులకు డా. బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, ప్రధాన కార్యదర్శి చిట్యాల లచ్చయ్య లు మరియు కమిటీ సభ్యుల పక్షాన సవినయంగా ఆహ్వానించారు.

Post a Comment

0 Comments