కోరుట్లలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవాలు - ఆయన సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శమన్న వక్తలు

 


కోరుట్లలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవాలు - ఆయన సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శమన్న వక్తలు 

- ఉత్సవాలలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లు, పలు పార్టీల ప్రముఖులు 

జగ్జీవన్ మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు 5 లక్షలు ఎంపీ నిధులు  కేటాయిస్తామన్న బిజేపి నేతలు డాక్టర్ అనూప్ రావు, రుద్ర శ్రీనివాస్ లు..

- జగ్జీవన్ పార్కు స్థలాన్ని, మహాలక్ష్మి దేవాలయ రహదారిని కాపాడాలంటూ డా. పేట భాస్కర్ డిమాండ్ 

ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 5 :

దివంగత భారత దేశ మాజీ ఉప ప్రధాని, సమాతవాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధుడుగా, సంఘసంస్కర్తగా, రాజకీయవేత్తగా వెనుకబడిన వర్గాల నుంచి ఎదిగి దేశానికి ఎనలేని సేవలు చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని పలువురు నాయకులు పేర్కొన్నారు.


కోరుట్ల పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద అంగరంగ వైభవంగా జరిగిన ఆయన 119 వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కమీషనర్ రవీందర్, బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వై అనూప్ రావు, విగ్రహదాత రుద్ర శ్రీనివాస్, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మరియు కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ.. భారత పార్లమెంటులో 40 ఏళ్లపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడని,1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అనే సంస్థను స్థాపించడంలో బాబు జగ్జీవన్ రామ్ కీలకపాత్ర పోషించాడన్నారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తరువాత కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు 1946లో జోహార్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో అతిపిన్న వయసుకుడైన జగ్జీవన్ రామ్ మంత్రిగా, అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో దేశ ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అనేక సంస్కరణలకు ఆద్యుడుగా నిలిచాడన్నారు.

ఈసందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకుల కోరిక మేరకు నూతనంగా ఏర్పాటు కానున్న బాబు జగ్జీవన్ రామ్ మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు 5 లక్షల ఎంపీ నిధులు కేటాయిస్తామని బిజేపి నాయకులు వెల్లడించారు.


అనంతరం డా పేట భాస్కర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడుతునే ఆయన పేరిట ఏర్పాటు జరుగుతున్న పార్కు స్థలాన్ని, మహాలక్ష్మి దేవాలయ రహదారిని చిధ్రం చేస్తూ వాగును బొందాలగడ్డగా మారుస్తున్న ఇసుక మాఫియా పై కొరడా ఝులిపించి వాటిని రక్షించవలసిన బాధ్యత పాలకులపై వుందని డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ అన్నం లావణ్య అనీల్, కౌన్సిలర్లు మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, తెడ్డు శ్రీజ విజయ్, సోగ్రాభీ, పొట్ట సురేందర్, కస్తూరి లక్ష్మీనారాయణ, తిరుమల వాసు,  ఎలుగూరి కిరణ్, కాంగ్రెస్, బిజేపీ, బిఆర్ఎస్, ఎంఐఎం అధ్యక్షులు, నాయకులు, సమాజ్ వాదీ రాష్ట్ర కార్యదర్శి ముజాయీద్, నిరసిస్తూ నియోజకవర్గ అధ్యక్షులు ఇట్యాల రాజేందర్, దళిత సంఘాల ప్రముఖులు చిట్యాల భూమయ్య, లచ్చయ్య, వుయ్యల నర్సయ్య, చెట్పల్లి లక్ష్మణ్, బలిజ రాజారెడ్డి, బెక్కెం అశోక్, దొబ్బల వెంకటేష్, కృష్ణంరాజు, సామల్ల దశరథం, శనిగారపు రాజేష్, రామిల్ల రాంబాబు, తాళ్లపల్లి మహేష్, అల్లం రాజేష్, చిట్యాల నిఖీల్, కొడి పెళ్లి సురేష్, షాహేద్, జాగృతి జిల్లా అధ్యక్షురాలు డి.సుజాత, రిజర్వుడు ఎస్సై అల్లం రమేష్, మున్సిపల్ మేనేజర్ చిట్యాల శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఇన్స్పెక్టర్ అశోక్ మరియు సిబ్బంది, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments