డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 5 :
స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్‌రామ్ గారి జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపియస్ జగ్జీవన్‌రామ్ గారి ఫోటోకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక అసమానతలకు ఎదురు చెప్పుతూ, అణగారిన వర్గాల అభ్యుదయానికి పాటుపడిన సంఘసంస్కర్త అని విద్య, వ్యవసాయం, రక్షణ, కార్మిక రంగాల్లో కీలకంగా సేవలందించిన జగ్జీవన్‌రామ్ భారత సమాజ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారు అన్నారు. మనం కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, సమానత్వం, సోదరత్వం కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించాలిని ఎస్పీ అన్నారు. ఆ మహానీయులను స్మరింస్తూ.. మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర్య సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సైదులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


0 Comments