కోరుట్ల గడి బురుజుల స్థలాల అక్రమ కబ్జాలపై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు
- ప్రజావాణిలో విఎల్టిలను రద్దు చేయాలని కోరిన అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులు
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 6 :
కోరుట్ల పట్టణంలోని చారిత్రక గడి బురుజులు మరియు వాటి చుట్టూ ఉన్న గ్రామ కంఠం, ఆబాదీ స్థలాఐపై అక్రమంగా కబ్జాలు చేసి వాటిని ప్లాట్లుగా మార్చి అమ్ముకునేందుకు నకిలీ దస్తావేజులతో గుట్టుచప్పుడు కాకుండా సంబంధిత అధికారులతో కుమ్మక్కై విఎల్టిలు వేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి అలా విఎల్టిలు వేసినట్లయితే వెంటనే రద్దు చేయాలని కోరుతూ గడి బురుజుల పరిరక్షణ సమితి మరియు అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, గడి బురుజుల చుట్టుపక్కల ఉన్న ఖాళీ భూములను లక్ష్యంగా చేసుకుని కొందరు భూ మాఫియా వ్యక్తులు నకిలీ దస్తావేజులు సృష్టించి, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఆ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇకనైనా తమరు వాటిని రద్దు చేయాలని కోరగా జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ కోరుట్ల కమీషనర్ ను పిలిచి ఏమైనా ఆనాలోచనలు జరిగినట్లయితే వేంటనే రద్దు చేయాలని ఆదేశించారు.
ఈసందర్భంగా అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, చింత భూమేశ్వర్, ఎండి ముజీబుర్ రెహమాన్, బోనగిరి మల్లారెడ్డి లు మాట్లాడుతూ ఇంకా ఈ భూములను ప్లాట్లుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయవద్దని ఎవరైనా అమాయకంగా గడి స్థలాలు కొనవద్ధని ఈ విషయంలో కోరుట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
గడి బురుజులు పట్టణ చరిత్రకు ప్రతీకలని, అవి కబ్జాకు గురైతే భవిష్యత్ తరాలకు అమూల్యమైన వారసత్వం కోల్పోయే ప్రమాదం ఉందని ఇది ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో గడి బురుజుల ప్రాంతాన్ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించేలా కూరగాయల మార్కెట్, పార్కు ఏర్పాటు, గడి బురుజులలో ఉన్న మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మరియు కోనేరును పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .అలా కానీ పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు.



0 Comments