జాతీయ మెగా లోక్ అదాలత్ విజయానికి కృషి చేసిన పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు అందించిన జిల్లా జడ్జి
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 7 :
జిల్లాలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు బార్ అసోసియేషన్ సభ్యులను గౌరవ జిల్లా జడ్జి శ్రీమతి రత్న పద్మావతి అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు.
తేదీ 28.03.2026 శనివారం నాడు నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో జిల్లా పరిధిలో మొత్తం 3034 కేసులు పరిష్కారం కావడం జరిగిందన్నారు .
ఈ విజయానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు బార్ అసోసియేషన్ ప్రతినిధులను మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో సత్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీమతి రత్న పద్మావతి మాట్లాడుతూ, పోలీస్ అధికారులు, బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది సమిష్టిగా కృషి చేసి కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి “రాజీ మార్గమే రాజమార్గం” అని అవగాహన కల్పించినందువల్లే ఈ స్థాయిలో కేసులు పరిష్కారం కావడం సాధ్యమైందన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, ఇరు వర్గాలకు న్యాయం చేకూరుతుందని తెలిపారు.గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో కేసులు పరిష్కరించడంలో సమన్వయంతో పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు బార్ అసోసియేషన్ సభ్యులను అభినందిస్తూ, రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్, అదనపు జిల్లా జడ్జి శ్రీ నారాయణ, లీగల్ సెల్ సెక్రటరీ వెంకట మల్లిక్ సుబ్రమణ్య శర్మ, మేజిస్ట్రేట్ లు లావణ్య, నికిషా, డిఎస్పి రఘు చందర్, బార్ కౌన్సిల్ జగిత్యాల అధ్యక్షులు, అలాగే జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



0 Comments