యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్ -డిఎస్పీ అడ్లూరి రాములు వెల్లడి


యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్ -డిఎస్పీ అడ్లూరి రాములు వెల్లడి 

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ :

కోరుట్ల మండలంలోని మాధాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి (వయస్సు 20 సంవత్సరాలు) హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. 

ఈ కేసులో ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్యను కట్నం వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా, నిందితుడు హరిబాబుకు సహకరించి, బాధితురాలిని కట్నం కోసం మానసికంగా మరియు శారీరకంగా వేధించినట్లు తెలిసిన చిత్తారి లక్ష్మి (తల్లి), చిత్తారి ఆనంద్ (అన్న), చిత్తారి అశోక్ (అన్న) వారి పై కట్న వేధింపులు మరియు హత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేశారు .

మెట్ పల్లి డిఎస్పి ఏ. రాములు ఆదేశాల మేరకు, ఎస్సై చిరంజీవి దర్యాప్తు చేపట్టి, ఈ కేసులో నిందితులు అయిన చిత్తారి లక్ష్మి , చిత్తారి ఆనంద్, చిత్తారి అశోక్ లను గురువారం తేది: 19-03-2026 న అరెస్ట్ చేసి, డిఎస్పి గారి ముందు హాజరుపరచగా, డిఎస్పి వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0 Comments