ఉగాది అంటే షడ్రుచుల వేడుక.. ఉగాది అంటే కష్టసుఖాల కలయిక - డా. పేట భాస్కర్

 


ఉగాది అంటే షడ్రుచుల వేడుక.. ఉగాది అంటే కష్టసుఖాల కలయిక - డా. పేట భాస్కర్


ప్రజా దండోర న్యూస్ / డెస్క్ ఇంచార్జీ  :


పకృతిలో  సంభవించే మార్పులతో వచ్చేదే ఉగాది.. యుగానికి ఆది లాంటిది ఉగాది.. పంచాంగ శ్రవణాల ఉగాది పండుగ షడ్రుచుల వేడుకతో పాటు కష్టసుఖాల కలయిక మనసులు పరిమళించే సంతోషాల వేడుక పిల్లలను ఆనంద పరిచే కుడుకల పేర్ల వేడుక అని ప్రజా దండోర తెలుగు దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ అన్నారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తరాలు మారినా తరగని సంప్రదాయాల ఉగాది.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను.. సమానంగా స్వీకరించాలనే తాత్వికతను బోధించే గొప్ప పండుగ.. మన ఉగాది..

కొత్త ఆశలు.. కోటి ఆకాంక్షలతో..

మొదలుకాబోతున్న శ్రీ పరాభవ నామ సంవత్సరంలో.. సకల విజయాలు కలగాలని కోరుకుంటూ ప్రజా దండోర తెలుగు దినపత్రిక మరియు వెబ్సైట్ పాఠకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, తెలుగు ప్రజలందరికి ప్రజా దండోర  పక్షాన ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ మనస్పూర్తిగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు .

Post a Comment

0 Comments