వరకట్న దాహంతోనే వైష్ణవిని హత్య చేసిన భర్త హరిబాబు

 




వరకట్న దాహం తోనే వైష్ణవిని హత్య చేసిచ భర్త హరిబాబు 

-  మెట్ పల్లి డిఎస్పీ అడ్లూరి రాములు వెల్లడి 

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి :

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం లోని మాదాపూర్ గ్రామంలో మంగళవారం వైష్ణవి అను గర్భవతి మహిళా మృతి తీవ్ర కలకలం రేపింది. వరకట్న దాహంతోనే వైష్ణవి ని తన భర్త హరిబాబు చంపినట్లు బుధవారం కోరుట్ల పోలీస్ స్టేషన్లో డిఎస్పీ అడ్లూరి రాములు వెల్లడించారు. 

ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..తేదీ 17-03-2026 ఉదయం 10:00 గంటలకు గంధం దుర్గాప్రసాద్ (వయస్సు 45 సంవత్సరాలు), నివాసం: మాధాపూర్ గ్రామం ఫిర్యాదు సమర్పించినారు. తన కుమార్తె చిత్తారి @ గంధం వైష్ణవి (వయస్సు 20 సంవత్సరాలు) కొంతకాలంగా యూట్యూబ్ ద్వారా వీడియోలు రూపొందిస్తూ ఉండేది. సుమారు 10 నెలల క్రితం చిత్తారి హరిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహం కోసం వచ్చి, కట్నం ఇవ్వలేమని స్పష్టంగా తెలియజేసినా, తరువాత ఇద్దరి మధ్య పరిచయం పెరిగి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి కట్నం లేకుండా వివాహానికి అభ్యంతరం వ్యక్తం చేయగా, ఒత్తిడి తీసుకొచ్చేందుకు హరిబాబు విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పేర్కొన్నారు. చికిత్స అనంతరం కోలుకున్న తరువాత, మళ్లీ వివాహం కోసం ఒత్తిడి చేయగా, ఫిర్యాదుదారుడు మొదట నిరాకరించారు. అయినప్పటికీ, 29-05-2025న హరిబాబు వైష్ణవిని తీసుకెళ్లి వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం వారు ఫిర్యాదుదారుడి ఇంటిలోనే నివసించసాగారు.

కొంతకాలం తరువాత హరిబాబు రూ.5,00,000/- కట్నం కోరగా, ఫిర్యాదుదారుడు ఆ మొత్తాన్ని ఇచ్చి మాధాపూర్ గ్రామంలో రెండు గుంటల భూమిని కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ, అదనంగా మరొక రూ.5,00,000/- కోరుతూ, తన కుమార్తెను మానసికంగా మరియు శారీరకంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో హరిబాబు తల్లి లక్ష్మి మరియు అతని అన్నలు ఆనంద్, అశోక్ కూడా ప్రేరేపించినట్లు ఆరోపించారు. సుమారు మూడు నెలల క్రితం వైష్ణవి గర్భవతిగా మారినప్పటికీ, వేధింపులు కొనసాగినట్లు తెలిపారు.

తేది. 16-03-2026 రాత్రి 11:00 గంటల సమయంలో వైష్ణవి మరియు హరిబాబు తమ గదిలో నిద్రకు వెళ్లగా, తెల్లవారుజామున 04:00 గంటల సమయంలో శబ్దాలు వినిపించాయని, తలుపు తట్టినా తీయకపోవడంతో తిరిగి వెళ్లినట్లు తెలిపారు, నిందితుడు తన భార్య వైష్ణవిని నిద్రలో ఉండగా కత్తితో దాడి చేసి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినాడు.

తేది. 17-03-2026 ఉదయం 06:00 గంటల సమయంలో హరిబాబు ఒంటరిగా బయటకు వచ్చి, ముఖం కడిగి, తన మోటార్ సైకిల్పై ఎవరికి తెలియకుండా వెళ్లిపోయాడు. అనంతరం గది తలుపు తెరిచి చూడగా, వైష్ణవి మంచం పక్కన రక్తపు మడుగులో పడివుండగా, నుదిటిపై గాయాలు మరియు మెడపై గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే ఆమెను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, కోరుట్లకు తరలించగా, వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ప్రకటించారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు హత్య అనంతరం 17-03-2026 ఉదయం 06:00 గంటల సమయంలో తన బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ (నంబర్: TG-21-A-8026) పై ఇంటి నుండి వెళ్లి, రాయికల్ మైతాపూర్ ప్రాంతాల్లో తిరుగుతూ, అనంతరం కొనరావుపేట ఎక్స్ రోడ్ సమీపంలోని ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇంటి మెట్ల కింద కత్తి మరియు రక్తపుమచ్చలున్న దుస్తులను దాచిపెట్టి అక్కడే సాయంత్రం వరకు ఉన్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు, అదే రోజు సాయంత్రం 18:30 గంటల సమయంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడి వద్ద నుంచి ఒప్పంద ప్రకటన (confession) తీసుకుని, పంచుల సమక్షంలో రికవరీ పంచనామా నిర్వహించబడినది. ఈ సందర్భంగా క్రింది వస్తువులు స్వాధీనం చేసుకున్నారు:

బజాజ్ పల్సర్ బైక్ నెంబర్ ( TG-21-A-8026)

నేరంలో ఉపయోగించిన రక్తపుమచ్చలున్న కత్తి

రక్తపుమచ్చలున్న నీలం రంగు జీన్స్ ప్యాంట్

నిందితుడు ధరించిన రక్తపుమచ్చలున్న నీలం రంగు టీ-షర్ట్  వున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈసమావేశంలో కోరుట్ల సిఐ సురేష్ బాబు, ఎస్సై ఎం చిరంజీవి లు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments