రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
ఈద్గా ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్ :
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ప్రార్థనలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లావ్యాప్తంగా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ పవిత్ర రంజాన్ పర్వదినం అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వం నింపాలని ఆకాంక్షించారు.
ఎస్పి వెంట డిఎస్పి అడ్లూరి రాములు, మరయు ఇన్స్పెక్టర్ లు, ఎస్.ఐ లు ఉన్నారు.


0 Comments