బాల్కోండ నియోజకవర్గంలో జరిగే మహానీయుల జయంతోత్సవాల జాతరను విజయవంతం చేద్దాం
- ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ పిలుపు
ప్రజా దండోర న్యూస్ / మోర్తాడ్ ప్రతినిధి :
నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రానున్న ఏప్రిల్ మాసము లో నిర్వహించనున్న భారతదేశ బహుజన మహనీయులైన బాబు జగ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గార్ల జయంతి ఉత్సవాల సందర్భంగా వారి జ్ఞాపకార్థం జయంతి ఉత్సవాల జాతరను నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో పాదయాత్రలతో మహానీయుల చరిత్రను సమాజానికి తెలియజేయాలనే సంకల్పంతో ఉత్సహ కమిటీ అధ్యక్షులు, మాజీ జడ్పిటిసి సావేల గంగాధర్ వారి సహచరుల నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా మహానీయుల జయంతోత్సవ జాతరను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ పిలుపునిచ్చారు.
ఈసందర్భంగా ఉత్సవాల కమిటీ అధ్యక్షులు సావేల గంగాధర్ మాట్లాడుతూ చురుకైన బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంక్ష బలంగా ఉన్న కార్యకర్తలతో కూడిన మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేయడమైనది ఈ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో చెందిన సుమారు 90 గ్రామాలను కలుపుతూ పాదయాత్ర కొనసాగుతుందని నియోజకవర్గ కేంద్రం మధ్యలో ఉన్న మోర్తాడ్ మండలం నందు మహానీయుల జయంతి ఉత్సవాల జాతర కార్యక్రమం చేపట్టడం జరగనుందని ఇందుకు సంబంధించి బహుజనుల నుండి విద్యావంతలను మేధావులను యువకులను కుల సంఘాల పెద్దలను కలవడం వారిని ఆహ్వానించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఈకార్యక్రమంలో ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల జిల్లా నాయకులు మామిడి రాజు, గైని థామస్, కొడాలి నర్సయ్య, ధర్మసమాజ్ పార్టీ నేత కాసుల సూర్య, కొడాలి నర్సయ్య ,జగిత్యాల జిల్లా నాయకులు శనిగారపు రాజేష్, చిట్యాల శివకుమార్, శనిగారపు చిన్న నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

0 Comments