కోరుట్ల మండలం పైడిమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి జిల్లా కలెక్టర్ అభినందనలు

 


కోరుట్ల మండలం పైడిమడుగు  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి జిల్లా కలెక్టర్ అభినందనలు

ప్రజాదండోర న్యూస్ / జగిత్యాల ప్రతినిధి / సురేష్ కొడిపెల్లి :

జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉత్తమ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంగా అవార్డు అందుకున్న జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అభినందించారు.                                           

సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పైడిమడుగు పాక్స్ సంఘం రైతులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రైతులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించి, ఆదర్శంగా నిలవాలని సూచించారు. రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్, పర్సన్ ఇన్ ఛార్జ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అసద్, సంఘ కార్యదర్శి రాజేందర్, శ్యామ్ సుందర్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments