మల్లాపూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం కాలువలో ట్రాక్టర్ బోల్తా
పసుపు కోతకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళ రైతు కూలీలు మృతి
ట్రాక్టర్ డ్రైవర్ మరియు తోట యజమాని గంగాధర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం
మరీ విషాదకరమైన విషయం రొడ్డ వైష్ణవి 6 వ తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థిని కూలీకి వెళ్లి మృతి
ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / కోరుట్ల నియోజకవర్గ ప్రతినిధి :
కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ శివారులో పసుపు కోతకు వెళ్లిన 15 మంది రైతులు తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి మొగిలిపేట కు చెందిన నలుగురు మహిళ రైతుల కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
మరి కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో హుటాహుటిన మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో సాయమ్మ, లలిత, రొడ్డ వైష్ణవి, పెద్దిరెడ్డి గంగులు ఉన్నారు.
మరీ విషాదకరమైన విషయం రొడ్డ వైష్ణవి 6 వ తరగతి చదువుతున్న నిరుపేద ఎస్సీ కులానికి చెందిన విద్యార్థిని తండ్రి కి మూడోవ కూతురుగా మొగిలిపేట లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అమ్మాయి కూలీ కి వెళ్లి మృతి చెందింది.
మంగళవారం కూలీ కి వెళ్లిన రైతులు సాయంత్రం తిరిగి వస్తుండగా మరికొద్ది సెపట్లో ఇల్లు చేరుతామనగానే ఈ దుర్ఘటన జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ మరియు పసుపు తోట యజమాని ఎర్రంశేట్టి గంగాధర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు మిగితా కూలీలు తెలిపుతున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ గంగాధర్ పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది.



0 Comments