కాంగ్రెస్ ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జువ్వాడి నర్సింగ్ రావు


కాంగ్రెస్ ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జువ్వాడి నర్సింగ్ రావు 

ప్రజా దండోర న్యూస్ /  మెట్ పల్లి ప్రతినిధి :

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావు మంగళవారం ప్రచార ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈసందర్భంగా ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కోరుట్ల నియోజకవర్గం లోని కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు.

ఇప్పటికే రెండు మున్సిపాలిటీలలో పార్టీ రెబల్ అభ్యర్థుల బుజ్జగింపులతో పాటు అవసరమైన కాడ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ గా లేదా వివిధ నామినేటెడ్ పదవుల అవకాశం కల్పిస్తామని చాలా మందికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు మూడు గంటల వరకు బిఫామ్ లు సబ్మిట్ చేయాలి. ఇక అభ్యర్థుల ఎన్నికల భవితవ్యం పై ప్రచార పర్వం మొదలవుతుంది.

Post a Comment

0 Comments