జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి కి ఎస్పీగా పదోన్నతి : శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్




జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి కి ఎస్పీగా పదోన్నతి : శుభాకాంక్షలు తెలిపిన  జిల్లా  ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ 

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి :

జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ కి ఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ చేతుల మీదుగా పిప్పింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ భుజాలపై స్టార్  చిహ్నాన్ని అలంకరించి అభినందిస్తూ, ఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కూకట్ పల్లి & కుత్బుల్లాపూర్ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ అయిన సందర్భంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలను  అందిచాలని సూచించారు.

Post a Comment

0 Comments