తల్లి దండ్రులు అంటే భయం భక్తి ఉండటానికి పర్యవేక్షణ చట్టం - రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్


తల్లి దండ్రులు అంటే భయం భక్తి ఉండటానికి చట్టం - ఫిర్యాదు చేసిన 60 రోజుల్లో సమస్య పరిష్కారం.

 - రాష్ట్ర వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్ : 

అనేక కష్టనష్టాలకు ఓర్చి పిల్లలను ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో తల్లి దండ్రుల పోషణ మరచిపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారని అలాంటి వారి కోసం ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల సంరక్షణ మరియు పర్యవేక్షణ చట్టం 2026 తీసుకువచ్చామని రాష్ట్ర వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల తల్లిదండ్రుల సంరక్షణ - పర్యవేక్షణ చట్టంపై జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్స్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.

ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ తల్లిదండ్రులు పోషణ పరిరక్షణ పట్టించుకోని కొడుకులకు భయం భక్తి ఉండటానికి కొత్త చట్టం తీసుకు వచ్చామని మంత్రి లక్ష్మణ్ తెలిపారు. బాధిత తల్లి దండ్రులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసే 60 రోజుల్లో విచారణ జరిపి న్యాయం చేస్తారని మంత్రి తెలిపారు. కొత్త చట్టం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు సైతం చట్టం వర్తిస్తుందని మంత్రి తెలిపారు. 

అసెంబ్లీలో, మండలిలో బిల్లు ప్రవేశ పెట్టడానికి అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి అనేక రకాలుగా ఆలోచన చేసి కొత్త చట్టం తీసుకు వచ్చారని మంత్రి తెలిపారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి అన్నారు.

కొత్త చట్టాన్ని అమలు చేయడానికి పోలీసుల సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు. చట్టం అమలుపై రాష్ట్ర డీజీపీతో పాటు జిల్లా పోలీసు అధికారులకు తాను లేఖ రాస్తానని మంత్రి తెలిపారు.

 దేశంలో ఎక్కడ లేని చట్టం..

- వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజా

రాష్ట్రంలో తీసుకు వచ్చిన తెలంగాణ ఉద్యోగుల  తల్లిదండ్రుల పోషణ -  జవాబుదారీతనం మరియు పర్యవేక్షణ చట్టం 2026 దేశంలో ఎక్కడ లేని చట్టం అని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజా అన్నారు. అస్సాం రాష్ట్రంలో ఉన్న చట్టం కంటే అనే పదునైన చట్టమని శైలజా అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం చట్టం వర్తిస్తుందని శైలజా తెలిపారు.

ఈకార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ లు రాజ గౌడ్, బి లత, సంబంధిత అధికారులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments