ఉద్యమకారుల హామీలు నేరవేర్చాలని గళం విప్పిన ప్రముఖ సినీ నటి, ఎమ్మెల్సీ విజయశాంతికి ధన్యవాదాలు

 

ఉద్యమకారుల హామీలు నేరవేర్చాలని గళం విప్పిన ప్రముఖ సినీ నటి, ఎమ్మెల్సీ విజయశాంతికి
 ధన్యవాదాలు         

ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 1 :

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నేరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని శాసనమండలి లో గళం విప్పిన ప్రముఖ సినీ నటి, ఎమ్మెల్సీ విజయశాంతి ని హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈసందర్భంగా ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమకారుల కోసం మాట్లాడిన తెలంగాణ వీరనారి విజయశాంతి గారికి ఉద్యమకారులు రుణపడి ఉంటారని ప్రభుత్వం పై మరింత ఒత్తిడి పెంచి హామీలు అమలు జరిగేలా చూడాలని కోరారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మేనిఫెస్టో లో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 2.50గజాల ఇల్లస్థలం మరియు 5 లక్షల రూపాయలు వడ్డీలేని రుణాలతో పాటు సంక్షేమ పథకాలు అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర కార్యదర్శి బత్తుల శంకర్, హైదరాబాదు జిహెచ్ఎంసి చైర్మన్ దయానంద్, పెద్దపెల్లి జిల్లావర్కింగ్ ప్రెసిడెంట్ జునుగారి సుధాకర్, పెద్దపల్లి పార్లమెంట్ నేత పెరిక శ్యాం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments