ఘనంగా ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు శ్రీ సాయి చైతన్య హైస్కూల్ ప్రిన్సిపాల్ గా బొల్లారం భవిష్య
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, మెట్ పల్లి, నవంబర్ 13:
కోరుట్ల, మెట్ పల్లి పట్టణాలలోని వివిధ పాఠశాలలో ఘనంగా ముందస్తు బాలల దినోత్సవం నిర్వహించారు. మెట్ పల్లిలో శ్రీ సాయి చైతన్య హైస్కూల్, కోరుట్ల ఎస్ఆర్ఎస్పీ క్యాంప్, గడి కల్లూరు రోడ్డులో ఉన్న ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటామని, బాలలే దేశ భవిష్యత్తు అని ఉపాధ్యాయులు వివరించారు. పిల్లలలో విద్య, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ సాయి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ గా బొల్లారం భవిష్య ఎంతో హుందాగా వ్యవహరించడంతో పలువురు ఉపాధ్యాయుల దీవేనలు పొందారు. ఆటపాటలు, వివిధ కార్యక్రమాలతో పాఠశాలలలో పండుగ వాతావరణం నెలకొంది.
శ్రీ సాయి చైతన్య హైస్కూల్ ప్రిన్సిపాల్ బొల్లారం అనీల్ కుమార్, కల్లూరు రోడ్ లోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు లు పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు.





0 Comments