ఘనంగా డా. పేట భాస్కర్ – సుకన్య దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఆనందోత్సాహాల నడుమ వేడుకలు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, నవంబర్ 16:
తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డా. పేట భాస్కర్ – సుకన్య దంపతుల 31వ వివాహ వార్షికోత్సవ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల మధ్య ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా దంపతులు కేక్ కట్ చేసి తమ వివాహ వార్షికోత్సవ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు దంపతులకు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆత్మీయ పలకరింపులు, ఆనందోత్సాహాల మధ్య వేడుకలు సందడిగా సాగాయి.
31 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో అనుభవాలు, అనుబంధాలు, కుటుంబ బాధ్యతలను కలిసికట్టుగా పంచుకుంటూ ముందుకు సాగుతున్న భాస్కర్ – సుకన్య దంపతులకు పలువురు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దంపతులు తమపై ప్రేమాభిమానాలు చూపిస్తూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందించిన కుటుంబ సభ్యులు, మిత్రులు, పాత్రికేయ మిత్రులు, వివిధ పార్టీల నాయకులు, ఉద్యమ సహచరులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తన మాతృ మూర్తి పేట గంగు, కొడుకు కోడలు పేట ప్రభాస్ - అను, ఆత్మీయులు సుద్దాల నాగయ్య, అశోక్, నిమ్మల సందీప్ రెడ్డి, బుస అనీల్, పెడిమల్ల రాజు, గుండేటి రవి, శనిగారపు రాజేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.




0 Comments