కొండగట్టు ఆంజనేయ స్వామి చందనోత్సవం, మహాసంప్రోక్షణకు గవర్నర్‌కు ఆహ్వానం

 


కొండగట్టు ఆంజనేయ స్వామి చందనోత్సవం, మహాసంప్రోక్షణకు గవర్నర్‌కు ఆహ్వానం

గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు

ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్‌, నవంబర్ 17: 

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న  60 ఏళ్లకోసారి జరిగే చందనోత్సవం, మహాసంప్రోక్షణ, నిజరూప దర్శన మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లాను ఆహ్వానించారు.

చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం, రెవెన్యూ, దేవాదాయ శాఖల ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ శ్రీ ఎం. హనుమంతరావు తదితరులు మంగళవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.


ఈ సందర్భంగా కొండగట్టు క్షేత్ర పురాణం, ఆలయ ఆవిర్భావం, స్థలపురాణం, ఆధ్యాత్మిక విశిష్టత, చారిత్రక ప్రాశస్త్యాన్ని గవర్నర్‌కు వారు వివరించారు. 60 ఏళ్లకోసారి నిర్వహించే ఈ విశిష్ట ఆధ్యాత్మిక ఉత్సవాల ప్రాధాన్యతను తెలియజేస్తూ, మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ను ఆహ్వానించారు.

అంతకుముందు మహిళా భద్రత, షీ టీమ్స్‌, భరోసా విభాగాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) డాక్టర్‌ సౌమ్య మిశ్రా గవర్నర్ ను లోక్ భవన్ లో కలిశారు . రాష్ట్రంలో మహిళల భద్రత కు తీసుకుంటున్న చర్యలను వివరించారు.


Post a Comment

0 Comments