దుర్గాదేవి మండపాల్లో డా. పేట భాస్కర్ ప్రత్యేక పూజలు..

 


దుర్గాదేవి మండపాల్లో డా. పేట భాస్కర్ ప్రత్యేక పూజలు

భక్తి, ఐక్యత, సేవాభావంతో పండుగలు జరుపుకోవాలి - సమాజంలో సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్ష..

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, అక్టోబర్ 17 :

కోరుట్ల పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిపారవశ్యంతో కొనసాగుతున్నాయి. నవదుర్గా సేవా సమితి, గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డా. పేట భాస్కర్ వివిధ దుర్గాదేవి మండపాలను. జేఏసీ జిల్లా నాయకులు బండారి శంకర్, ఎలిశెట్టి గంగారెడ్డి, రేగుల మోహన్, ఇట్యాల రాజేందర్ లతో కలిసి సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, కోరుట్ల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ప్రార్థించారు.


పండుగలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు

ఈ సందర్భంగా డా. పేట భాస్కర్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు, సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. పండుగలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలకే పరిమితం కాకుండా, ప్రజల మధ్య ప్రేమానురాగాలను పెంచే సామాజిక వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు.

యువతలో సేవాభావాన్ని పెంపొందించి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగినప్పుడే బలమైన, ఐక్యమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ, పరస్పర సహకారంతో సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

కోరుట్లలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలి

దుర్గామాత ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని డా. పేట భాస్కర్ ఆకాంక్షించారు. కోరుట్ల పట్టణంలో శాంతి, సామరస్యం కొనసాగడంతోపాటు, అభివృద్ధి మరింత వేగవంతం కావాలని కోరుకున్నారు. భక్తితోపాటు సేవాభావాన్ని అలవర్చుకుని, సమాజహితమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా నాయకులు బండారి శంకర్, ఎలిశెట్టి గంగారెడ్డి, రేగుల మోహన్, ఇట్యాల రాజేందర్, నవదుర్గా సేవా సమితి నాయకులు పుప్పల నాగరాజు, శ్రీరాముల అమరేందర్, నీలి షణ్ముఖ్, కిరణ్, శేఖర్, గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షుడు దొబ్బల వెంకటేష్‌తో పాటు మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments