యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం -జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 13:
శాంతి భద్రతల మరియు సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు “ పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటో గ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి జగిత్యాల జిల్లాలో ఆసక్తి గల యువతక ఔత్సహిక ఫోటోగ్రాఫర్లు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే తీసిన (3) ఫోటోలు, తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 23వ తేదీ సాయంత్రంలోగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అందజేయాలన్నారు. ఇట్టి షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదు, 10 x 8 సైజ్ ఫోటోలను, షార్ట్ ఫిలింను పెన్ డ్రైవ్ లో మీ యెక్క పూర్తి వివరాలతో అందజేయలని, జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన మూడు షార్ట్ ఫిలింలను, ఫొటోలను రాష్ట్ర స్థాయి పోటీల గురించి డీజీపీ ఆఫీస్ హైదరాబాదుకు పంపించడం జరుగుతుందన్నారు.

0 Comments