మహనీయుల సేవలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ - ప్రజా దండోర




మహనీయుల సేవలు చిరస్మరణీయం - జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ 


ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూలై - 04


మహనీయుల సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ కొనియాడారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా, కలెక్టర్ బి.సత్యప్రసాద్ హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు ఉద్యమ సాయుధ దశలో చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేశారు.



ఈ కార్యక్రమాల్లో  జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి కె. జయరాజ్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కిషన్, కలెక్టరేట్ సిబ్బంది, మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments