మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ ఆశయసాధనలో ముందుకు సాగుదాం - డా. పేట భాస్కర్ పిలుపు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, జూలై 5:
భారత మాజీ ఉప ప్రధాని, సమతావాది, స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ ఆశయసాధనలో అందరు బాగస్వామ్యం అయి ముందుకు సాగాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ పిలుపునిచ్చారు.
సోమవారం కోరుట్ల పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆయన వర్థంతి కార్యక్రమాన్ని మనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ సేవలకు గుర్తుగా పట్టణంలో ఆయన పేరిట నిర్మిస్తున్న జగ్జీవన్ పార్క్ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిందని నాయకులు హామీలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో శూన్యమని ఇకనైనా వచ్చే జయంతోత్సవాల వరకైన పార్కును సుందరంగా తీర్చిదిద్దాలని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మరియు మున్సిపల్ పాలక పక్షాన్ని కోరారు. దేశంలో అనేక సంస్కరణలకు మూలకారకుడైన బాబు జగ్జీవన్ రామ్ సేవలను బడుగు బలహీన వర్గాల ప్రజలు, నాయకులు ముం దుకు తీసుకవేళ్లాలని దానిలో అందరి భాగస్వామ్యం కావాలని స్పష్టం చేశారు.
ఈకార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, తెడ్డు శ్రీజ విజయ్, విగ్రహా కమిటీ ప్రధాన కార్యదర్శి చిట్యాల లచ్చయ్య, మాదిగ కుల సంఘం అధ్యక్షులు శనిగారపు రాజేష్, మాజీ కౌన్సిలర్ ఎం డి సాబీర్, చిట్యాల ప్రభాకర్, నర్సయ్య, రవుఫ్, సాజీద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


0 Comments