జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కారాగారం” లో వైద్య శిబిరము - ప్రజా దండోర

 


జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కారాగారం” లో వైద్య శిబిరము

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూలై 2:

టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం తేదీ 02.07.2026 రోజున జైలర్ ముగిలేష్ గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కారాగారం” లో వైద్య శిబిరము ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సలహాలను సూచించారు. రెండు వారాలకు మించి దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం, తెమడలో రక్తం పడటం, చాతిలో పట్టేసినట్టు ఉండడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి  తగు పరీక్షలు చేయించుకొని మందులు వాడాల్సిందిగా సూచించారు. 

జిల్లా కారాగారం లో ఉన్న 45 మంది ఖైదీలకు డిజిటల్ ఎక్స్ రే పరీక్షలు నిర్వహించి టీబీ పరీక్ష కొరకు రెండు కఫం ఎగ్జామ్ కలెక్షన్ చేయడం జరిగింది. మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు ,క్షయ వ్యాధి  గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలి అని తెలియజేశారు .

ఈ వైద్య శిబిరంలో డాక్టర్ సతీష్, డాక్టర్ సురేందర్, జైలర్ మొగిలేష్,రేడియోగ్రాఫర్ వికాస్ ,ఎస్ టి ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు .



Post a Comment

0 Comments