హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి
డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్, జూలై 2 :
జగిత్యాల జిల్లా మెట్పల్లి అర్బన్ కాలనీలో నిర్మాణ దశలో ఉన్న హెల్త్ సెంటర్‌తో పాటు కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట వద్ద నిర్మిస్తున్న హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు.
నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణంతో పాటు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ప్రహరీ, రహదారి వంటి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు చేరేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు.
అనంతరం మెట్పల్లి పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నమోదు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు తప్పనిసరిగా నమోదు అయ్యేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని, అవసరమైన మార్గదర్శకాలు అందిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు కల్పించాలని సూచించారు. నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెట్ పెల్లి, కోరుట్ల ఆర్డీఓలు నరసింహారావు, జీవాకర్ రెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) సుజాత, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు..





0 Comments