యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల ఉచిత శిక్షణ కరపత్రాన్ని విడుదల చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 25:
జగిత్యాల జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులకు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సేవలైన సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ అందించేందుకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారా హిల్స్లో ఎస్సీ Study Circle నిర్వహించనున్న పది నెలల ఉచిత రెసిడెన్షియల్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కం మెయిన్స్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని కలెక్టరేట్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత భోజన వసతి సదుపాయాలతో పాటు స్టడీ మెటీరియల్, పాకెట్ మనీ, డిజిటల్ లైబ్రరీ తదితర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు వికలాంగ అభ్యర్థులు ఆన్లైన్ website http://tsstudycircle.co.in ద్వారా జూలై 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె. రాజ్ కుమార్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments