రెనోవేషన్ చేసిన మెట్‌పల్లి సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ - ప్రజా దండోర

 


నేరాల నియంత్రణ, ప్రజా భద్రత, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి


రెనోవేషన్ చేసిన మెట్‌పల్లి సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్


ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 24:


ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన (రెనోవేషన్ చేసిన) మెట్‌పల్లి సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యాలయంలో కల్పించిన సౌకర్యాలు, రికార్డుల నిర్వహణ, భద్రతా చర్యలు, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను ఎస్పీ పరిశీలించారు. 



అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, కార్యాలయ పరిసరాల పరిశుభ్రత,ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అంశాలపై సూచనలు చేశారు. పోలీస్ కార్యాలయాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండటంతో పాటు, సిబ్బందికి అనుకూలమైన వాతావరణం కల్పించడం ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.



అనంతరం వార్షిక తనిఖీల్లో భాగంగా సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించిన ఎస్పీ, సర్కిల్  పరిదిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసులలో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, పరిశీలించారు. గ్రేవ్ కేసులలో  ఫోక్సో కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. SOP ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు.కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తరచుగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయాలని, సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలనీ సి.ఐ కి  సూచించారు. 


సర్కిల్ పరిదిలోని  రౌడీ షీటర్లు , హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి  సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. కమ్యూనిటీ పోలీసులలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు సైబర్ నేరాలు వివిధ సామాజిక అంశాలపై ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని, అదేవిధంగా సి సి కెమెరాలు యొక్క ప్రాముఖ్యత గురించి గ్రామాల్లో తెలియజేస్తూ ప్రతి గ్రామoలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే నేరాల నియంత్రణలో విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని , మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 



ఈ సందర్భంగా మెట్ పల్లి  సర్కిల్  ఆవరణలో ఎస్పీ గారు మొక్కలు నాటారు. 



ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాములు , సి.ఐ లు  సురేష్ బాబు, లక్ష్మీ నారాయణ, DCRB ఎస్.ఐ  ప్రదీప్, ఎస్సైలు కిరణ్ కుమార్, అనిల్, చిరంజీవి, నవీన్, గంగాధర్, రాజునాయక్, రవికిరణ్, శ్రీధర్ రెడ్డి  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments