రామోజీ పేటలో వైభవంగా శ్రీ గంగమ్మ జాతర బోనాలు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన డా. బోగ శ్రావణి, దావ వసంత సురేష్
ప్రజాదండోర న్యూస్ / జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి / సురేష్ కొడిపెల్లి, జూన్ 10:
రాయికల్ మండలం రామాజిపేట గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గంగమ్మ జాతర బోనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి, మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాల్లో సంప్రదాయ పండుగలు, జాతరలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆకుల మహేష్, ఉపాధ్యక్షుడు వట్టిమల్ల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు గడ్డం మల్లారెడ్డి, బోయిని నరేందర్, పల్లికొండ రవికిరణ్, నాయకులు ఆర్మూర్ రాజు, తోకల నరేష్, ఎర్రరెడ్డి, కనికరపు రాజేష్, పందిరి శ్రీనివాస్, ఏనుగంటి నరేష్, ఇద్దాం గంగారెడ్డి, కార్యకర్తలు, గంగపుత్ర సంఘ సభ్యులు, మహిళలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 Comments