మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కొమిరెడ్డి రాములు జయంతి వేడుకల్లో పాల్గొన్న డా. పేట భాస్కర్
ప్రజా దండోర న్యూస్ / మెట్ పల్లి ప్రతినిధి, జూన్ 3:
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే, సుప్రీంకోర్టు న్యాయవాది స్వర్గీయ కొమిరెడ్డి రాములు జయంతి వేడుకలను మెట్ పల్లి విదిత్ రెడ్డి గార్డెన్లో తన కుమారులు ప్రముఖ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొమిరెడ్డి కరమ్ , విజయ్ అజాద్ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన
ఈ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు తో కలిసి పాల్గొన్న తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డా. పేట భాస్కర్ కొమిరెడ్డి రాములు చిత్రపటానికి పూల మాలతో ఘన నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ గతంలో కోరుట్ల లోని వెటర్నరీ కళాశాలను తరలించేందుకు కుట్రపూరితంగా కొందరి నాయకుల ప్రోద్బలంతో కోరుట్ల లో అసౌకర్యంగా ఉందంటూ విద్యార్థులు హైదరాబాద్ ఇంద్ర పార్క్ లో ధర్నా చేస్తున్న సందర్భంలో కోరుట్ల అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అప్పటి ఎమ్మెల్యే తో పాటు కొమిరెడ్డి రాములు అండగా నిలిచారని అందరం కలిసి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్ళి ప్రస్తుత వెటర్నరీ కళాశాలను కాపాడుకోవడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక జిల్లాల పునర్విభజన సందర్భంలో కోరుట్ల - మెట్పల్లిని కలుపుకుని నూతన జిల్లా ఏర్పాటుకు ఉద్యమించాలనే ప్రధాన సంకల్పంతో తమతో చాలాసార్లు చర్చలు జరిపారని ఉద్యమించారని అన్నారు. ఆయన ఆశయం జిల్లా కాకున్నా రెండు పట్టణాలు రెవెన్యూ డివిజన్ లు గా ఏర్పడ్డాయన్నారు.
వెటర్నరీ కళాశాల కోసం అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో.. (ఫైల్ ఫోటో)కొమిరెడ్డి జ్యోతక్క ఎమ్మెల్యే గా గెలుపొందిన సందర్భంలో అ ఎన్నికల్లో తాను కథాలపూర్ మండలంలో కొన్ని కుల సంఘాలకు ఇంచార్జీ గా పని చేశానని అప్పటినుండే వారి కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేట భాస్కర్ పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో తనతో పాటు ప్రముఖ దళిత బహుజన సంఘాల సీనియర్ రాష్ట్ర నాయకులు గజ్జెల స్వామి, మెట్ పల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల లక్ష్మణ్, కోరుట్ల అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం, ఎం డి ముజాహిద్, చింత భూమేశ్వర్, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



0 Comments