కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పోలీస్ పతకాలకు ఎంపికైన 35 మంది పోలీస్ అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ - ప్రజా దండోర



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పోలీస్ పతకాలకు ఎంపికైన 35 మంది పోలీస్ అధికారులు

అభినందించి, పథకాలు అందించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ఐపీఎస్


ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 2:


పోలీస్ శాఖలో విశేషమైన సేవలు అందించి, విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదానం చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్కృష్ట , అతి ఉత్కృష్ట, సేవ, ఉత్తమ సేవ పోలీస్ పతకాలకు ఎంపికైన 35 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పతకాలకు ఎంపికైన అధికారులను ప్రత్యేకంగా అభినందించి, వారికి పతకాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో నిబద్ధతతో, అంకితభావంతో సేవలందిస్తున్న అధికారులకు ఈ గుర్తింపు లభించడం జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.



అనంతరం ఎస్పీ  మాట్లాడుతూ పోలీస్ శాఖలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేసే సిబ్బందికి వారి సేవలకు తగిన గుర్తింపు ఎప్పటికైనా లభిస్తుందని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి ప్రభుత్వం మాత్రమే కాకుండా సమాజం నుంచి కూడా గౌరవం దక్కుతుందని తెలిపారు.ఈ పతకాలు కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా మొత్తం పోలీస్ శాఖకు గౌరవాన్ని తీసుకువస్తాయని అన్నారు. ఇప్పటికే పతకాలకు ఎంపికైన అధికారులు, సిబ్బంది తమ సేవలను మరింత మెరుగుపరుచుకుంటూ ప్రజలకు ఉత్తమమైన పోలీసింగ్ అందించాలని, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీలు రాములు ,పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments