మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 117 మొబైల్ ఫోన్లను ( సుమారు 23 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.
సైబర్ మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్
ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 23:
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 117 మొబైల్ ఫోన్లను ( సుమారు 23 లక్షల విలువగల ) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక RSI, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్ లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. CEIR పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1838 ( 3,67,60,000 లక్షల విలువగల ) ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందనిఅన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ CEIR టీం ను జిల్లా ఎస్పీ గారు అభినందించి రివార్డ్ అందజేశారు.
సైబర్ మోసాలపైప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిపై అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అజ్ఞాత వ్యక్తుల కు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని కోరారు. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా విధానాన్ని వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు.సాంకేతికతను ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ గారికి చాలా ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.
తండ్రి కానుకగా ఇచ్చిన మొబైల్‌ను ట్రేస్ చేసి బాధితురాలికి అందజేత : రచన తన తండ్రిగారు పుట్టినరోజు కానుకగా ఇచ్చిన మొబైల్ ఫోన్‌ను అనుకోకుండా పోగొట్టుకుంది. ఫోన్ కోసం ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆమె వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేసింది.ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు, మొబైల్ ఫోన్‌కు సంబంధించిన IMEI వివరాలను సేకరించి CEIR పోర్టల్‌లో నమోదు చేశారు. అనంతరం సాంకేతిక ఆధారాల సహాయంతో ట్రాకింగ్ నిర్వహించి ఆ మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి రికవరీ చేశారు.రికవరీ చేసిన మొబైల్ ఫోన్‌ను బాధితురాలు రచనకు తిరిగి అందజేయగా, తన తండ్రి ప్రేమతో ఇచ్చిన అమూల్యమైన కానుకను తిరిగి పొందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సహకరించిన పోలీసు అధికారులు మరియు CEIR టీంకు రచన కృతజ్ఞతలు తెలిపారు.
*దేవాలయంలో దొంగిలించిన మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి బాధితురాలికి అందజేత:* మంజుల తన కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయానికి వెళ్లిన సమయంలో ఆమె మొబైల్ ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించారు. ఫోన్ కనిపించకపోవడంతో జరిగిన విషయాన్ని గుర్తించిన మంజుల వెంటనే మొబైల్ ఫోన్ IMEI నంబర్‌ను CEIR పోర్టల్‌లో నమోదు చేసి ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుపై స్పందించిన CEIR టీం సాంకేతిక ఆధారాల సహాయంతో మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ప్రారంభించింది. అనంతరం ఆ మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి రికవరీ చేసి బాధితురాలు మంజులకు తిరిగి అందజేశారు.
రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి బాధితుడికి అందజేత :
వరుణ్ కుమార్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ఆయన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. అనంతరం బాధితుడు తన మొబైల్ ఫోన్ IMEI నంబర్‌ను CEIR పోర్టల్‌లో నమోదు చేసి ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుపై స్పందించిన పోలీస్ CEIR టీం వెంటనే ట్రాకింగ్ ప్రారంభించి, సాంకేతిక ఆధారాల సహాయంతో మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి రికవరీ చేశారు. అనంతరం ఆ మొబైల్ ఫోన్‌ను బాధితుడు వరుణ్ కుమార్‌కు తిరిగి అందజేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్, ఐపీఎస్, సైబర్ క్రైమ్ ఎస్.ఐ దినేష్,CEIR టీం హెడ్ కానిస్టేబుల్ మహుముద్, కానిస్టేబుల్ అజర్, అనూష, ప్రశాంత్, పాల్గొన్నారు.




0 Comments