"దళిత రత్న" అవార్డు గ్రహీతలు బైరి విజయ్ కుమార్ , వనతడుపుల అంజయ్య లకు ఘన సన్మానం
పూలే అంబేద్కర్ ఆశయాల సాధనకై కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, మే 24:
కోరుట్ల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, న్యాయవాది బైరి విజయ్ కుమార్, మరియు కల్లూరు మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా మహానీయులు బాబు జగ్జీవన్ రామ్, బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలను పురస్కరించుకొని ప్రతిష్టాత్మకంగా ప్రధానం చేసే “దళిత రత్న” అవార్డులు బైరి విజయ్ కుమార్, వనతడుపుల అంజయ్య లను వరించాయి.
ఈసందర్భంగా కోరుట్ల పట్టణ ప్రజలు, మేధావులు మరియు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ నూతనంగా కోరుట్లలో ఆవిర్భవించున బీసీ ఎస్సీ ఎస్టీ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో
సి. ప్రభాకర్ గ్రంథాలయ ఆవరణలో చెన్న విశ్వనాథం అడ్వకేట్ అధ్యక్షతన అభినందన సభ ఘనంగా నిర్వహించారు.
అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజంలో దళితుల అభ్యున్నతి, సామాజిక న్యాయం, ప్రజాసేవ పట్ల బైరి విజయ్ కుమార్ మరియు వనతడుపుల అంజయ్య చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని భవిష్యత్తులో వారు పూలే అంబేద్కర్ ఆశయాల సాధనలో ముందుండాలని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఓటారికారి శ్రీనివాస్ సభలో పేర్కొన్నారు. సమాజ సేవలో వారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దళిత సమాజ హక్కుల పరిరక్షణలో సామాజిక చైతన్య నిర్మాణంలో మరియు న్యాయ పరిరక్షణలో వారు చేస్తున్న సేవలు యువతకు ఆదర్శమని సభలో మరిపెళ్లి గంగాధర్ అడ్వకేట్ కొనియాడారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు అయిన బైరి విజయకుమార్ మరియు వనతడుపుల అంజయ్యను శాలువాలతో ఘనంగా పలువురు నాయకులు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యావంతుల వేదిక కన్వీనర్ మరిపెళ్లి గంగాధర్ , తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు తుల రాజేందర్, న్యాయవాదులు ప్రేమ్ సాగర్, బద్ది నర్సయ్య, అలాల సత్యనారాయణ పలు సంఘాల నాయకులు సుతారి రాములు, శికారి గోపి, ఎం డి ముజాహిద్, కుంచెం శంకర్, గంగ నరసయ్య, మహాతేజ, పట్టణ ప్రముఖులు మరియు గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.




0 Comments