రాయికల్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా, గంటన్నర సేపు రాకపోకలు స్తంభన -- ప్రజా దండోర

 


రాయికల్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా, గంటన్నర సేపు రాకపోకలు స్తంభన


 ధర్నా లో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత


ప్రజా దండోర న్యూస్ / రాయికల్ ప్రతినిధి, మే 25:


మొక్కజొన్న కొనుగోళ్లపై జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నాకు దిగారు. దాదాపు గంటన్నర సేపు రాకపోకలు స్తంభించాయి.



ఈ ధర్నాకు సంఘీభావంగా బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని గత ఐదు రోజులుగా కొనుగోలు నిర్వహణ ఆగిపోయిందని ఇకనైనా వెంటనే కొనుగోలు చేయాలని లేకపోతే మక్కలు కళ్లాలపై మొలకెత్తి పరిస్థితి దాపురిస్తుందని ఆరోపించారు.

 ఈ సందర్భంగా రాయికల్ ఎస్సై సుదీర్ రావు, మండల రెవెన్యూ అధికారి ధర్మయ్య రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో జగిత్యాల ఆర్డిఓ రంగంలోకి దిగి రైతులతో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో ఫోన్ సంభాషణలో మాట్లాడుతూ ఉన్నపళంగా ఈరోజు లారీలను పంపిస్తామని ధర్నా విరమించుకోవాలని హామీ ఇవ్వడంతో రాస్తారోకో ధర్నాను విరమించారు.

Post a Comment

0 Comments