బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ - ప్రజా దండోర


బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్


ఈద్గా ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 28:

బక్రీద్ ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ముస్లిం సోదర,సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.



ఈ సందర్భంగా జగిత్యాల, కోరుట్లలో గల పలు ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ గారు స్వయంగా పరిశీలించారు. ప్రార్థనలకు వచ్చే వారికి  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లావ్యాప్తంగా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments