జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి TSJU పక్షాన ప్రత్యేక ధన్యావాదాలు




జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి TSJU పక్షాన ప్రత్యేక ధన్యావాదాలు 


అక్రిడిటేషన్ల జారీతో పాటు, జూన్ 2 నాటికి ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి హర్షాతిరేకాలు.

ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్ ప్రతినిధి, మే 04:

తెలంగాణలో జర్నలిస్టుల చిరకాల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ మరియు I&PR శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరియు రాష్ట్ర మంత్రివర్గ సహచరులందరికీ 'తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (TSJU)' పక్షాన రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగొని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనీల్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

గత ప్రభుత్వాల హయాంలో గుర్తింపునకు నోచుకోక ఇబ్బందులు పడ్డ ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు కేబుల్ ఛానల్స్ జర్నలిస్టులకు, వెటరన్, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు జీవో 252 (G.O. 252) ద్వారా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసే గొప్ప నిర్ణయం తీసుకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గత ప్రభుత్వం కేవలం 23,352 మందికే అక్రిడిటేషన్లను పరిమితం చేయగా, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఏకంగా 46,000 మందికి పైగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఈ అవకాశాన్ని విస్తరించి దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. మే 1న జిల్లాల్లో కలెక్టర్ల ద్వారా కార్డుల పంపిణీకి ఆదేశాలు జారీ చేయడం, దరఖాస్తులకు మే 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించడం, అర్హులైన జర్నలిస్టులందరికీ మెరుగైన ఆరోగ్య, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తామని ప్రకటించడం జర్నలిస్టులకు కొండంత భరోసాను ఇచ్చింది. ఏప్రిల్ 30తో ముగుస్తున్న బస్ పాస్‌ల గడువును పొడిగించడం ఎంతో ఊరటనిచ్చింది.

ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు - జూన్ 2 నాటికి పరిష్కారం: అలాగే, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు చారిత్రాత్మకం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సచివాలయంలో వివిధ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలతో సమావేశమై.. జూన్ 2వ తేదీ (తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం) నాటికి న్యాయపరమైన చిక్కుల్లేకుండా ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించడం పట్ల TSJU హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన 'ఫ్యూచర్ సిటీ (Future City)'లో ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉండటం ఆయన దార్శనికతకు నిదర్శనం. 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సహా ఇతర సొసైటీల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు, జర్నలిస్టు సంఘాల్లో సభ్యులు కాని అర్హులైన వారికి కూడా న్యాయం చేసేందుకు మంత్రి పొంగులేటి తీసుకుంటున్న చొరవ అభినందనీయం. అందరూ ఒకే వేదికపైకి వచ్చి జేఏసీ (JAC)గా ఏర్పడాలన్న మంత్రి గారి సూచనను TSJU స్వాగతిస్తోంది. ఈ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న I&PR స్పెషల్ కమిషనర్  జి. ముకుంద రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు..

జర్నలిస్టుల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి: గత (బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో పత్రికా స్వేచ్ఛను హరించి, జర్నలిస్టులను దునుమాడిన ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా.. నా (పురుషోత్తం నారగౌని) అధ్యక్షతన ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాము. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆ ధర్నాకు హాజరై, మా పోరాటానికి, జర్నలిస్టులకు అండగా నిలబడ్డ వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాము. నాడు ప్రతిపక్ష నాయకుడిగా జర్నలిస్టుల కష్టాలను కళ్లారా చూసిన రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో జర్నలిస్టులకు ఈ ప్రయోజనాలను కల్పిస్తున్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి‌ రేవంత్ రెడ్డి గారికి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి మరియు మంత్రివర్గ సభ్యులకు TSJU సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments