సరిదిద్దుకోలేని తప్పిదంతో అక్రమ విఎల్టీలు వేసి బదిలీపై వెళ్తున్న కోరుట్ల మున్సిపల్ కమీషనర్ - ప్రజా దండోర

 


కోరుట్ల గడి బురుజుల మైసమ్మ సాక్షిగా ..


 సరిదిద్దుకోలేని తప్పిదంతో అక్రమ విఎల్టీలు వేసి బదిలీపై వెళ్తున్న కోరుట్ల మున్సిపల్ కమిషనర్ 


 కొత్త కమీషనర్ అయిన గడి స్థలాలు కాపాడుతాడా..? 


 ఈ అక్రమ దందా పై బిజెపి, బిఆర్ఎస్ సంతకాల సమరం.. ఇంకా మౌనముద్రలో అధికార కాంగ్రెస్..!


 డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్ : 


 కోరుట్ల గత వైభవ చరిత్రకు నిలువెత్తు నిదర్శనమైన కోట (గడి ) బురుజులు, కోనేరు వాటి స్థలాలు చాళుక్య జైనుల కాలం నాటి సంపద పై పర్యవేక్షకులుగా వున్న భూస్వాములు,ఆ సంపద మాదేనంటు నకిలీ దస్తావేజులతో వస్తుంటే వారికి అండగా పండ్లు చెకిలించి కండ్లు తెరుస్తూ కపట మాటలు వలకబోస్తు కద్దర్ ముసుగులో ప్రజలను వంచిస్తున్న నాయకులకు వారి మాటలు వింటు ప్రభుత్వ స్థలాలపై అక్రమ ప్రయోగాలు చేసే అధికారులకు గడి మైసమ్మ గట్టి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అది మర్చిపోవద్దని పలువురు గడి బురుజుల అభిమానులు,ప్రజలు హెచ్చరిస్తున్నారు. 

ప్రజలకేమీ తెలుసు పదనిసల రాగమంటు కమీషనర్ గడి స్థలాలకు వేసిన తప్పుడు వి ఎల్ టి నెంబర్ 6-4-288 తో పాటు కోరుట్ల ప్రజలను తప్పుదారి పట్టించేందుకు మరో రెండు ఇంటి నెంబర్ లు 6-1-63 మరియు 6-1-64 గల నెంబర్లు వేశారు. ఈ అక్రమ విఎల్టీలపై పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు దానిలో ఓ బడా నాయకునికి వాటాలు వెళ్లినట్లు సమాచారం.



 మున్సిపల్ కమిషనర్ చేసినటువంటి పొరపాట్లు


1- మొదట వి ఎల్ టి నెంబర్ దానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. అయినా తప్పుడు డాక్యుమెంట్ నెంబర్ స్వయంగా కమిషనర్ గారే అప్రూవల్ ఇచ్చినటువంటి అసెస్మెంట్లో డిజిటల్ సైన్ లో దొంగ డాక్యుమెంట్ నెంబర్ కనీసం ఈసీలో కూడా రానటువంటి డాక్యుమెంట్ నెంబర్ 6703/ 2015 రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తప్పుడుగా పొందుపరిచారు .


2- కమిషనర్ తప్పుగా వేసినటువంటి వి ఎల్ టి అందులో మరో తప్పు ఏమిటంటే ఇచ్చిన లెంత్ విడ్త్ 171 x305 = 52155÷9=5795 గజాలు కానీ కమిషనర్ గారు ఐదు గజాలు ఎక్కువ వేసి 5800 రౌండ్ ఫిగర్ చేసినాడు


3- వేసిన తప్పుడు వియ్యాల్టీకి 1894లో ఉన్నట్టు ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ చూపించారు అప్పటికి స్వతంత్రం కూడా రాలేదు


ఇన్ని తప్పడు ఆధారాలతో బయటపడ్డ కమీషనర్ ను సస్పెండ్ చేయాలని వెంటనే గడి స్థలాల విఎల్టీలను ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి వాటిని రద్దు చేయాలని అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు నిరసన దీక్షలు, రాస్తారోకో లు మరియు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లతో సంతకాల సేకరణ కూడా చేయించి అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకాలు చేస్తే విఎల్టీలు రద్దయితాయని గత నాలుగు రోజులుగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఛైర్పర్సన్ భర్త ను కలిసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న ఆయన బిజీ షెడ్యూల్ వల్ల కలవకపోవడం బాధాకరం. 

ఒక పక్క కోరుట్ల ప్రజల ఆకాంక్షలను నేరవేర్చాలని గడి స్థలాలలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మార్కెట్ యార్డు, పార్కు నిర్మాణం, మైసమ్మ దేవాలయం, కోనేరు అభివృద్ధి చేయాలని అక్కడ వేసిన విఎల్టీలు రద్దు చేయాలని బిజెపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సమరంకు సిద్ధంగా వుంటే  కాంగ్రెస్ కౌన్సిలర్లు మాత్రం మౌనం విడకపోవడం అనుమానాలకు తావిస్తుంది.

ఇన్ని రకాలుగా మోసం జరిగిందని ఉన్నతాధికారులకు, ప్రజలకు కండ్లకు కట్టినట్టు చూపించిన కమిషనర్ ను కేవలం బదిలీ పై పంపడం కాకుండా అక్రమ విఎల్టీలకు అతనిపై కఠిన చర్యలు తీసుకుంటే బాగుండునని ఇకనైనా అ విఎల్టీలను రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

ప్రభుత్వం సోమవారం పలువురు కమీషనర్ ల బదిలీ ఉత్తర్వులో ఇలా పేర్కొన్నారు ప్రభుత్వం కింద గ్రేడ్ -2, గ్రేడ్ 3, మున్సిపల్ కమిషనర్ ల సేవలు ఉపసంహరించుకుని, FR 14 ( A )  నిబంధనల ప్రకారం లీన్  ( Lien ) కాలపరిమితిలో భాగంగా వారిని సాధారణ పరిపాలన శాఖకు సహాయ విభాగ అధికారులుగా తిరిగి పంపింది. అందులో కోరుట్ల కమీషనర్ గుండే రవీందర్ కూడా వున్నారు. 

ధర్మపురి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న గ్రేడ్ -2 కమీషనర్ ఎం శ్రీనివాసరావు ను కోరుట్ల మున్సిపల్ కమిషనర్ పదవికి ఎఫ్ఏసిగా నియమించారు.

ఇక సరిదిద్దుకోలేని తప్పిదంతో వెళ్లుతున్న కమీషనర్ రవీందర్ స్థానంలో నూతనంగా వస్తున్న కమీషనర్ అయిన గడి స్థలాలు రక్షించాలని, మున్సిపల్ లో జరుగుతున్న అవినీతి పై కొరడా ఝులిపించాలని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు పాత్రికేయులు, అఖిలపక్ష ప్రజాసంఘాలు కోరుతున్నారు.

Post a Comment

0 Comments