దరుర్ లో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 03 :
జగిత్యాల అర్బన్ మండలం ధరుర్ గ్రామానికి చెందిన షరీఫ్ హప్సా దంపతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశ కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం చీర కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, ఉప సర్పంచ్ బాలే శ్రీను, మాజీ సర్పంచ్ ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ మహేష్, ఏఎంసి డైరెక్టర్ నరేష్, వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments