మెట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం - ప్రజా దండోర

 


మెట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం 

ప్రజా దండోర న్యూస్ / మెట్ పల్లి ప్రతినిధి, మే 2:

జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో గల శ్రీనాథ్ ఆటో స్పేర్ పార్ట్స్ షాప్ లో ప్రమాదవశాత్తు మంటలు చెల్లరేగి వేగంగా వ్యాపించాయి షాపులోని ఆయిల్, టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు వల్ల మంటలు తీవ్రంగా మారి ఆటో స్టోర్ దగ్దమైంది.

షాపు వెనుక భాగంలో ఉన్న మార్కెట్ యార్డులోని చెట్టు ఎండిపోయి దాని పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు తుప్పుతో  నిండి వుందని ఎన్ని సార్లు వాటిని తొలిగించాలని మార్కెట్ యార్డు అధికారులకు సిబ్బందికి చెప్పిన పట్టించుకోలేదని అ చెత్తకు తగిలిన మంటలే షాపుకు తగిలి దగ్ధమైందని షాపు యజమాని రవి ఆరోపించారు.

 సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది  కూడా ఆలస్యంగా వచ్చి మంటలను ఆర్పేశారు. ఫైర్ సిబ్బంది రావడంతో చుట్టుపక్కన మంటలు వ్యాపించకుండా మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నికి ఆహుతైన షాపు యజమానిని పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వ ఆదుకుంటామని తెలిపారు.


ఈవిషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, మెట్ పల్లి సిఐ సురేష్ బాబు, ఎస్సై కిరణ్ లు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

Post a Comment

0 Comments