బాలల భరోసా ప్రభుత్వ లక్ష్యం, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, డ్రగ్స్ రహిత తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష్యం..


రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్


ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి,మే 01: 


బాలల సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఆరేళ్లలోపు పిల్లలు అంగవైకల్యానికి గురికాకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'బాల భరోసా' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం 'మే' డే వేడుకలతో పాటు బాల భరోసా కార్యక్రమం మరియు నశముక్త్  కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైయ్యారు. 



ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్ల వయసు వచ్చే వరకు చిన్నారులు వివిధ రకాల వ్యాధుల బారిన పడి అంగవైకల్యానికి గురవుతున్నారని, తెలంగాణ సమాజానికి భవిష్యత్తులో సిబ్బంది జరుగుతుందని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 'బాల భరోసా' అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సున్నా నుండి ఆరు ఏళ్ల వయసున్న చిన్నారులను వివిధ రకాల పరీక్షలు చేసి లోపాలు ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ అందించి ఎలాంటి వైకల్యం రాకుండా చూడడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని మంత్రి తెలిపారు. 


ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 లక్షల మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో పలువురికి లోపాలను గుర్తించామని మంత్రి తెలిపారు. వీరికి వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. స్థానికంగా వైద్యం అందుబాటులో లేకుంటే హైదరాబాద్ లో చికిత్సలు అందిస్తామని మంత్రి తెలిపారు. 



మేడే సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలిచి పనిచేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేవలం మూడు రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపించామని మంత్రి తెలిపారు. కార్మిక శాఖ ద్వారా అందుతున్న పథకాలను జగిత్యాల జిల్లాలోని అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లాలో టాంకాం ద్వారా శిక్షణను అందించి జగిత్యాల ప్రాంత యువత విదేశాల్లో ఉద్యోగాలు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులకు మంత్రి సూచించారు.

ఈకార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, అదనపు కలెక్టర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా వైద్యాధికారి తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.