జిల్లాలో పనిచేస్తున్న DCRB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కు డిఎస్పీ గా పదోన్నతి - శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి,మే1:
జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో DCRB ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీఎస్పీగా పదోన్నతి పొందారు.
ఈ సందర్భంగా ఆయన శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన శ్రీనివాస్ ను జిల్లా ఎస్పీ అభినందించి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేశారు.
పోలీస్ శాఖలో పనిచేస్తూ ఎన్నో ఏళ్లుగా ప్రజా సంరక్షణ కోసం అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి పదోన్నతి ఒక గొప్ప గుర్తింపు అన్నారు. పదోన్నతి అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక మైలురాయి వంటిదని ముఖ్యంగా పోలీస్ శాఖలో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించవలసి ఉంటుందని ఎస్పీ అన్నారు.


0 Comments