మేడే సందర్భంగా కార్మికులకు లేబర్ & ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేసిన - కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, మే 01 :
కార్మికుల దినోత్సవం సందర్భంగా కోరుట్లలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్‌లో కోరుట్ల మరియు మెట్‌పల్లి పట్టణాల్లోని వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న కార్మికులకు తన స్వంత నిధులతో లేబర్ & ఇన్స్యూరెన్స్ కార్డులను కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులు సమాజానికి బలమైన వెన్నెముకలని, వారి శ్రమతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్మికులు అందరూ యూనియన్‌గా ఏర్పడి, ఒకటిగా నిలబడితే తమ హక్కులను సులభంగా సాధించుకోవచ్చని సూచించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ప్రయత్నాలు చేసినా తన వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు..
అదేవిధంగా బ్యాంకు LDM రామ్ కుమార్ తో కలిసి కార్మికులకు చిన్నపాటి వ్యాపారాలపై అవగాహన కల్పించారు. స్వయం ఉపాధి అవకాశాలు, బ్యాంకు రుణాలు ఎలా పొందాలి, ప్రభుత్వ పథకాల ద్వారా ఎలా లబ్ధి పొందాలి అనే విషయాలపై వివరించారు. కార్మికులు ఆర్థికంగా ఎదగడానికి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..



0 Comments