సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక "దళిత రత్న" పురస్కారం




కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం 

(గంగుల రాంగోపాల్, సీనియర్ పాత్రికేయులు)

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, మే 01: 

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది  బైరి విజయ్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే "దళితరత్న" పురస్కారం వరించింది.

గురువారం  హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం అందించారు. ప్రతి యేటా దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావంతులు, సామాజిక వేత్తలు, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులను గుర్తించి అందించే ప్రతిష్టాత్మకమైన “దళిత రత్న” అవార్డు ఈయేడు న్యాయవాద వృత్తిలో 19 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న బైరి విజయ్ కుమార్ ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. 

ఈ సందర్భంగా బైరి విజయ్ కుమార్ మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి సత్కరించడం అమిత ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం దళిత సమాజం పట్ల నా బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరింత న్యాయ పరమైన సేవలను దళిత జాతికి, నిమ్న వర్గాలకు అందిస్తూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

పురస్కారం అందజేసిన కమిటీ సభ్యులకు, ఎస్సీ ఉపకులాల జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం, మేరీ మాదిగకు కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సమాజ సేవలో విశిష్ట కృషి చేస్తున్న వ్యక్తులకు ప్రోత్సాహాన్ని అందించేలా, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ వెల్లడించారు.

Post a Comment

0 Comments